
* ఒంగోలు వాసవీ క్లబ్స్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ప్రదర్శన
ఆకేరు న్యూస్ ఒంగోలు : జాతీయ జెండాను తెలుగు వాడైన పింగళి వెంకయ్య రూపొందించడం తెలుగు వారందరికీ గర్వకారణమని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ అన్నారు. స్థానిక వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో 3600 అడుగుల పొడవైన జాతీయ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాఠశాల ,కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.జాతీయ భావనను, సమైక్యతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)కె.నాగేశ్వరరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు,వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ ఎరుకుల్లా రామకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ శిద్ధా వెంకట సూర్య ప్రకాష్ రావు ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ యం. శ్రీనివాసరావు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..