
* ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలు మంచిది కాదు
* ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని పేర్కొంది. ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి రాజకీయ పార్టీలకు మంచిదికాదని అభిప్రాయపడింది. ఉచితంగా రేషన్, డబ్బు (Free Ration, money) ఇస్తుంటే పనిచేసేందుకు కొందరు ఇష్టపడడం లేదని తెలిపింది. ఉచితాల కారణంగా ప్రజలు పనికి మొగ్గు చూపడం లేదని పేర్కొంది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్ని పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలను చేసింది. విచారణ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది.
…………………………………