* మంత్రి కొండా సురేఖ
* మహిళపై చిరుత పులి దాడిపై మంత్రి సురేఖ దిగ్భ్రాంతి
ఆకేరున్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హాత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో అర్క భూంబాయి (52) అనే మహిళపై చిరుత పులి దాడి చేసి గాయపర్చిన ఘటన పట్ల మంత్రి సురేఖ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. చిరుత దాడి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, చిరుత కదలికలపై నిఘా పెట్టాలని మంత్రి సురేఖ పిసిసిఎఫ్ను ఆదేశించారు. అటవీశాఖ పిసిసిఎఫ్ డోబ్రియాల్తో ఫోన్లో మాట్లాడి చిరుత దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మహారాష్ట్రకు సరిహద్దుగా వున్న ఈ గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామం చివరకు వెళ్ళిన మహిళపై చిరుత దాడి చేసినట్లు పిసిసిఎఫ్ మంత్రికి తెలిపారు. ఈ చిరుత మహారాష్ట్ర సరిహద్దు నుండి ఆదిలాబాద్లోకి ప్రవేశించిందని.. పశువుల మంద మేత మేస్తున్న సమయంలో వాటిపై దాడి చేయబోయిన చిరుత, మహిళ కదలికలను గుర్తించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు పిసిసిఎఫ్ మంత్రికి వివరించారు. గాయపడిన మహిళలను వెంటనే ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నామని.. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్లు తెలిపినట్లు పిసిసిఎఫ్ మంత్రికి వివరించారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్లు స్పష్టం చేశారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
