
* డిప్యూటీ సీఎం భట్టి
ఆకేరున్యూస్, హైదరాబాద్: దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం ( Deputy CM) మల్లు భట్టివిక్రమార్క (mallu batti vikramarka ) అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దేశ తొలి మహిళా ప్రధానిని నెగెటీవ్‌గా చూపిస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ (indira gandhi) జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రపంచస్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇందిరా పాత్ర కీలకపాత్ర పోషించారన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు విడిచారని.. ఆమెపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేనివారు కావాలని సినిమాలు చేస్తున్నారని.. గతం గురించి తెలియని వారు ఇందిరా చరిత్రను వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. గతం గురించి తెలిసినవారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని.. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………….