* బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(PHONE TAPPING CASE) కీలక మలుపు తిరిగింది. కేసు దర్యాప్తులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఇప్పటి వరకు అధికారులపైనే కేసులు నమోదు చేసిన పోలీసులు తొలిసారిగా.. రాజకీయ నాయకుడిపై కేసు నమోదు చేశారు. బీఆర్ ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(EX MLA CHIRUMARTHI LINGAYYA)కు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్(JUBILIHIILS) ఏసీపీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కేసు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరగడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కొంత రాజకీయ నాయకుల ఒత్తడితోనే అధికారులు ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే తొలుత మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లింగయ్య ప్రమేయం ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి నిఘా ఉంచినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే.. ఆయనకు నోటీసులు (NOTICES) జారీ చేశారు. ఈక్రమంలో నెక్ట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
…………………………………………………..