* ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ ఎస్లే కారణం
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని సీఎం అంటున్నారని, ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్, బీఆర్ ఎస్లే అని విమర్శించారు. బీజేపీ (BJP)రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, జడ్జిలు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేశారని, బీజేపీ కార్యాలయ సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఓ అవగాహనకు వచ్చాయని విమర్శించారు. రెండు పార్టీల నిజ స్వరూపాన్ని బీజేపీ కార్యకర్తలు బయట పెట్టాలని, 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ (CONGRESS) ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు. జిల్లాలు, మండలాలతో పాటు గ్రామాల్లోనూ కొత్త కమిటీలు వేసుకున్నామని, కొత్త రక్తంతో ఉరకలు వేయాలని సూచించారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
