![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/image-4.png)
* ఒకరి మృతి.. నలుగురికి గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : అమెరికా(America)లో మళ్లీ విమాన ప్రమాదం జరిగింది. రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రైవేట్ జెట్‌ను మరో విమానం గుద్దుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత రన్‌వే నుండి జారి, రాంప్‌పై నిలిపి ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆరిజోనాలోని స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. పది రోజుల క్రితం కూడా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గగనతంలోనే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని(American Airlines plane) హెలికాప్టర్ ఢీ కొట్టడంతో విమానం కూలిపోయింది. కూలిపోయిన విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు . భారీ ప్రాణ నష్టం జరిగింది.
………………………………………..