* ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
ఆకేరున్యూస్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం వరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ.. ‘ది గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ అవార్డుతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారతీయులందరి తరఫునా ఈ అవార్డు స్వీకరిస్తున్నానన్నారు. భారత్`ఇథియోపియా బంధాలను పటిష్ఠం చేసేందుకు సహకరించిన ఎందరో భారతీయులకు ఇది గుర్తింపు అభివర్ణించిన మోదీ.. ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ.. తన తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఇథియోపియా రాజధాని అదిస్ అబాబా చేరుకున్నారు. అంతకముందు.. విమానాశ్రయంలో ఆయనకు అబీ అహ్మద్ అలీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య పరస్పర ప్రయోజనకర విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. థియోపియాకు వెళ్లడానికి ముందు జోర్డాన్ దేశంలో పర్యటించారు మోదీ. ఆ దేశ రాజధాని అమ్మాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఐదేళ్లలో భారత్`జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని రెట్టింపు చేసి 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునేలా ప్రయత్నం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం వహించి లబ్ది పొందాలని ఆ దేశ వాణిజ్య సంస్థలను మోదీ కోరారు.
……………………………………….
