Krishnajigudem health center issue
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
హెల్త్ సెంటర్ నిర్మాణ పనుల ప్రారంభం కోసం కృష్ణాజి గూడెం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెంలో హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు అయ్యాయి. 2009లో ఏర్పాటుచేసిన కాలనీలో సబ్ సెంటర్ నిర్మాణానికి నాలుగు ఫ్లాట్లు కేటాయించారు. అట్టి స్థలంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మించాలని గ్రామపంచాయతీ తీర్మానించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు హెల్త్ సెంటర్ నిర్మాణానికి ముగ్గు పోసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికీ పలుమార్లు నిర్మాణ పనుల శంకుస్థాపన వాయిదా వేయడంతో ఏఈ, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవోలను కలిసినప్పటికీ నిర్మాణ పనులకు అడుగు పడలేదు. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ఆదేశాలివ్వాలని గ్రీవెన్స్ సెల్ లో వినతి పత్రం అందించారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో సర్పంచ్ మల్లం రవీందర్, పుట్ట బాపు రెడ్డి, మాజీ సర్పంచ్ సాదం వెంకటయ్య, కోరిపెల్లి మల్లారెడ్డి, కర్ర మల్లారెడ్డి, పుట్ట రాంచంద్రరెడ్డి, పుట్ట రాజశేఖరరెడ్డి, సాదం రాజేందర్, వడ్లకొండ యాదగిరి, సాదం రమేష్, గద్ద కుమార్, ఉరడి బుచ్చిరాజ్, పిండి ప్రశాంత్, సాదం బీమయ్య, సాదం విష్ణువర్ధన్, సాదం రవి మాజీ ఉపసర్పంచ్, జక్కుల రాజు, జాగిల్లపురం సాయిబాబా, దొంత శ్రీనివాస్, జక్కుల కృష్ణ, గుండెల్లి రాజు, అక్కనపెల్లి రాజశేఖర్, నిరటి సురేష్, వడ్లకొండ లింగయ్య, సాదం లింగయ్య ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
