Pochamma Bonalu Hanamkonda
అకేరు న్యూస్ హన్మకొండ : శ్రావణమాసాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ టీ జంక్షన్ కాలనీలో పోచమ్మ బోనాల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు మరియు చిన్నారులు తలలపై బోనాలతో అమ్మవారి ఆలయానికి శోభాయాత్రగా బయలుదేరారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల మోతలతో కాలనీ అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. భక్తులు పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ వేడుకల్లో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం కాలనీలో ఆధ్యాత్మిక భావనను నింపుతూ, ఐక్యతను చాటిచెప్పింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
