Bull Dies After Eating Poisonous Pellets
* రైతు నాగరాజు కుటుంబంలో విషాదం
అకేరు న్యూస్ హన్మకొండ : హనుమకొండ జిల్లా, నడికూడ మండలం, పులిగిల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విష గుళికలు తినడంతో రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.
పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు భాషబోయిన నాగరాజు తన కుటుంబ జీవనాధారంగా వ్యవసాయంతో పాటు పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడికి చెందిన ఎద్దు ప్రమాదవశాత్తు విష గుళికలు తినడంతో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఎద్దు పరిస్థితి విషమించడంతో నాగరాజు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎద్దును కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమించి కొద్దిసేపటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కళ్ల ముందే తమ ఎద్దు ప్రాణాలు కోల్పోవడంతో రైతు నాగరాజు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడే ఎద్దును కోల్పోవడంతో తమకు తీరని నష్టం జరిగిందని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే వ్యవసాయంలో పెట్టుబడులు, పంటల నష్టాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎద్దు మృతి తమ కుటుంబానికి మరింత ఆర్థిక భారంగా మారిందని కుటుంబ సభ్యులు వాపోయారు. ఎద్దు కేవలం పశువు మాత్రమే కాదని, తమ కుటుంబ జీవనంలో భాగమైందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు నాగరాజు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాధిత రైతుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఒకవైపు వ్యవసాయ కష్టాలు.. మరోవైపు నమ్ముకున్న పశువును కోల్పోయిన బాధ.. రైతు నాగరాజు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
