* ఫోక్సో కేసు నమోదు
ఆకేరు న్యూస్ , వరంగల్ : పోలీస్ ఇన్స్పక్టర్ ( Police Inspector ) సస్పెన్సన్ కు గురయ్యారు. భూపాలపల్లి జిల్లలో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బండారి సంపత్ కుమార్ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మల్టీ జోన్ -1 ఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
భూపాలపల్లి జిల్లాలో సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ గా పనిచేస్తున్న బండారి సంపత్ కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసి పోలీస్ స్టేషన్ ఎస్. ఐ గా విధులు నిర్వహించారు .
ఆ సమయంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. సదరు మహిళ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ కాలనీలో నివాసం వుంటోంది. ఇన్స్ స్పెక్టర్ సంపత్ పరిచయంతో మహిళ కాపురంలో గొడవలు రావడంతో భర్తతో దూరమైంది. దీంతో ఆ మహిళ తో ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ సహాజీవనం చేయసాగాడు. సదరు మహిళా భర్త గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయగా సంపత్ కుమార్ ను వీఆర్ కు అటాచ్ చేసారు. కొద్ది రోజుల తర్వాత సంపత్ కుమార్ కు ఇన్స్ స్పెక్టర్ గా పదోన్నతి పై భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ గా నియమించబడ్డాడు.
ఇదే క్రమంలో ఇన్స్ స్పెక్టర్ సంపత్ సదరు మహిళ వద్దకు వస్తూ పోతున్న క్రమంలో సంపత్ దృష్టి మహిళ కుమార్తె పై పడింది. అ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆ మహిళ కేయూసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ పోలీసులు ఫోక్సో కేసు ( Pocso act ) క్రింద అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలిక పై అత్యాచారానికి యత్నించినందుకు ఇన్స్ స్పెక్టర్ సంపత్ పై శాఖపరమైన తీసుకునే చర్యల్లో భాగంగా భూపాల్ పల్లి సైబర్ క్రైమ్ ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ తెలిపారు.