ఆకేరున్యూస్ డెస్క్: పెండిరగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ మాజీ సర్పంచ్లు పోరుబాటకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని మాజీ సర్పంచ్లు అందరూ హైదరాబాద్కు వచ్చారు. ఈ విషయమై బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో మాజీ సర్పంచులు సమావేశమైయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని మాజీ సర్పంచులను బయటికి రాకుండా కట్టడి చేశారు. సమావేశమైన వారిలో మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాల దండి ఆంజనేయులు, దుంప అంజనేయులు తదితరులు ఉన్నారు.
………………………………………..