* తనకు తెలియకుండానే తన ఇల్లు అమ్మేశారని ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బంధువులపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తనకి తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై ట్రెస్పాస్, చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్పాస్, బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీనోటు తీసుకుని చీటింగ్‌కి పాల్పడ్డారని కేసునమోదు చేశారు. ఈ వ్యవహారంలో తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మాజారావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………..