Warangal BRS Leaders Arrested
అకేరు న్యూస్ వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లు లో నిర్బంధించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ల లో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను స్థానిక పోలీసులు తెల్లవారుజాము నుంచి ఇళ్లను నుంచి పట్టుకొచ్చి స్టేషన్లలో నిర్బంధించారు.
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ అరెస్టులు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శాంతియుతంగా ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
