* మహారాష్ట్ర వ్యక్తిగా గుర్తింపు
ఆకేరున్యూస్ డెస్క్: పలు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత 13 రోజుల్లో దాదాపు 300పైగా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు అందరి మదిలో ఎదురయ్యాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న నాగ్‌పూర్ పోలీసులు పురోగతి సాధించారు. మహారాష్ట్రలోని గోందియాకు చెందిన 35 సంవత్సరాల వ్యక్తిని గుర్తించారు. ఫేక్ బాంబు బెదిరింపుల వెనుక సదరు వ్యక్తి హస్తం ఉన్నట్లు సమాచారం. నాగ్‌పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్యాంక్ ఆ వ్యక్తిని జగదీశ్ ఉకేయిగా గుర్తించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని.. పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
……………………………………………………………….