* 23న భారత్ బంద్ నేపథ్యంలో నిర్ణయం
* కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఆకేరు న్యూస్, డెస్క్: ఏపీ పోలీసులు ప్రజా ప్రతినిధులకు ఆంక్షలు పెట్టారు. మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టులు ఈనెల 23న బారత్ బంద్కు పిలుపునిచ్చిన తరుణంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద భారీగా భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఏవోబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. అర్బన్ ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
