* కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ
* ఇంటిపై అనుచరులు, కార్యకర్తలు దాడి
* బీఆర్ ఎస్, కార్యకర్తల మధ్య ఘర్షణ
* నువ్ నా ఇంటికి రాలే.. నేను నీ ఇంటికి వచ్చా..
* నాపై మాట్లాడితే ఖబడ్దార్
* దమ్ముంటే బయటకు రా నా….. : గాంధీ
* చర్యకు ప్రతిచర్య తప్పదు
* నాపై ఆయుధాలతో దాడికి వచ్చారు : కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లో పొలిటికల్ హైటెన్షన్(Political Hitention) నెలకొంది. ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ(Arekapudi Gandhi), పాడి కౌశిక్ రెడ్డి(Padi Kousikreddy) మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. చెప్పినట్లుగానే కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ భారీ కాన్వాయ్‌తో చేరుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. కౌశిక్ ఇంటి బయట గాంధీ బైఠాయించి.. దమ్ముంటే బయట రా నా… అంటూ తీవ్రస్థాయిలో దూషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కౌశిక్ దాకున్నాడని, తాను పోలీసులతో రాలేదని తెలిపాడు. ఈ కోవర్టు.. ఈ దొంగ.. ఆ నా…. ఎమ్మెల్యై అయి సంవత్సరం కూడా కాలేదని, వాడా తనను హెచ్చరించేది.. అని ప్రశ్నించారు. చీర, గాజుల గురించి, మహిళలను కించపరిచేలా మాట్లాడడం మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ బయటకు వచ్చే వరకు ఇక్కడే ఉంటా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు, కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. దీనిపై కౌశిక్ రెడ్డి సైతం స్పందించారు. చర్యకు ప్రతిచర్య తప్పదని, రేపు ఏం జరుగుతుందో చూస్తారని అన్నారు. ఆయుధాలతో దాడికి వచ్చి, తనపై హత్యాయత్నం చేశారని, ఇక్కడున్న పోలీసులు అడ్డుకోలేదని, అంత విధ్వంసం చేస్తున్నా ఎందుకు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
—————————-