
* మూసారంబాగ్ రహదారి మూసివేత
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. మూసీ నది (MOOSI RIVER) కి వరద పోటెత్తుతోంది. దీంతో వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని హిమాయత్ సాగర్ (HIMAYATH SAGAR) గేట్లు ఎత్తడంతో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జిపై వన్‌వే రహదారిని మూసివేశారు. మూసీ నది పరివాహ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా చించల్ పేట సమీపంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో. కాలువలు, వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్ నగరానికి ఈ రోజు భారీ వర్ష సూచనల ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమయితేనే బయటకు రావాలని, ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా చూసుకోవాలని, సాయంత్రం షిప్‌్ట ఉన్న వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
………………………………….