
* సిద్దిపేట జిల్లాలో దారుణం
* యువతిని బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకున్న యువకులు
ఆకేరున్యూస్ సిద్ధిపేట : పెళ్లి అయిన 13 రోజులకు యువతికి కడుపు నొప్పి రాగా భర్త వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తే ఆ భర్త షాక్ తినే వార్తను డాక్టర్లు అతనికి తెలిపారు. యువతి గర్భం దాల్చింది అని డాక్టర్లు చెప్పడంతో నిర్ఘాంతపోవడం భర్త వంతయింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. ప్రేమ పేరుతో ఉదయ్ కిరణ్ ఆ యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న ఉదయ్ కిరణ్ మిత్రుడు పవన్ కల్యాణ్ ఆ యువతిపై కన్నేశాడు. తన కోరికను తీర్చకుంటే ఉదయ్ కిరణ్ తో ఉన్న సంబంధాన్ని బయట పెడతానని బెదిరించాడు. ఇద్దరు కలిసి ఆ యువతి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. పెళ్లి చేసుకోవడానికి ఉదయ్ నిరాకరించడమే కాకుండా పవన్ కల్యాణ్ తో కలిసి యువతిపై అత్యాచారం చేశాడు ఉదయ్ కిరణ్. ఈ విషయం బహిర్గతం కాకముందే పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో యువతి తల్లిదండ్రులు మరో యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన 13 రోజులకు యువతికి కడుపునొప్పి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో గతం అంతా బయటకు వచ్చింది. డాక్టర్లు గర్భవతి అని నిర్ధారించడంతో యువతి భర్త నిలదీశాడు దీంతో ఆ యువతి గతం మొత్తం భర్తకు వివరించింది, దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………