* ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాదిగలను నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని.. మాదిగ, ఉపకులాలకు పిలుపునిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సోమాజిగూడలో గురువారం మందకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 1న నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తొలుత దేశంలో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందని హామీ ఇచ్చారని.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు.
ఆ హామీని నిలబెట్టుకోలేదని.. ఎస్సీ రిజర్వేషన్ల అమల్లో పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ముందు వసరులో ఉన్నాయని మందకృష్ణ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్ మాటలకు విలువ లేకుండా పోయిందని.. మాదిగల పట్ల ఆయన మాటలు తేనే పూసినట్టు ఉంటాయని.. కానీ అవి మాకు తీపిని అందించవు. మాకు చేదుగానే, మోసంగానే ఉంటాయని మందకృష్ణ తెలిపారు. పరీక్షల నిర్వహణ కానీ అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి శాసనసభా వేదికగా చెప్పాడు. దీన్ని కూడా రేవంత్‌రెడ్డి విస్మరించాడన్నారు.
…………………………….