*శీతకాల విడిదిలో భాగంగా పర్యటన ఖరార్
* బొల్లారంలో రెండు రోజులు బస
* నగరంలో కట్టుదిట్టమైన భద్రత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 21న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో 1:10 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30గంటలకు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 3:25 గంటల వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకొని 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. 22వ తేదీ ఉదయం 9:30గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టదిట్టమైన భద్రత చేపట్టారు. శీతకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో రెండు రోజులు బస చేయడం ఆనవాయితీ.
……………………………………………….
