ఆకేరున్యూస్, గయానా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (MODI) కి మరో అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమెనికా (GAYANA, DOMENICA) దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించాయి. ప్రస్తుతం గయానా పర్యటనలో ఉన్న మోదీ ఈ రెండు పురస్కారాలను అందుకోగా.. ముందుగా డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు ‘డొమెనికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో మోదీని సత్కరించారు. కొవిడ్ సమయంలో తమ దేశానికి మోదీ అందించిన సహాయ సహకారాలకు ఈ అవార్డును అందించారు. అలాగే గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందించారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును కోట్లాది మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
……………………………….