
* అక్కడి నుంచి కర్నూలుకు
* 13, 400 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆకేరు న్యూస్, శ్రీశైలం : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటకు విచ్చేశారు. కర్నూలు లోని ఓర్వకల్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక మివానంలో చేరుకున్న ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. శివాజి దర్బార్ హాల్, ధ్యాన మందిరాన్ని సందర్శించారు. దాదాపు 50 నిముషాల పాటు స్వామివారి సన్నిధిలో మోదీ గడిపారు. భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన, మల్లికార్జున స్వామి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి కర్నూలు బయలుదేరి వెళ్లారు. అక్కడ నిర్వహించే సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు. సభా వేదిక పై నుంచే ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం 13, 400 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోదీ సభ నిమిత్తం 7, 500మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
………………………………………………………………………………….