
ఆకేరున్యూస్, ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లారు. ఈ రోజు థాయ్ రాజధాని బ్యాంకాక్ చేరుకోగా.. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ రోజు, రేపు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్‌లో జరగనున్న ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ కూటమి సమావేశంలో పాల్గొంటారు.
……………………………