* జీ-20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు పర్యటన
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగే జీ-20 సమ్మిట్ కోసం బయలుదేరారు. బ్రెజిల్ సహా గయానా, నైజీరియా దేశాల్లో పర్యటించనున్నారు. గతేడాది జీ-20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలోలో పర్యటించబోతున్నారు. 5 దశాబ్ధాల తర్వాత ఒక భారత ప్రధాని గయానకు వెళ్లడం ఇదే మొదటిసారి. ప్రధాని తన 5 రోజుల పర్యటనలో మొదటి రెండు రోజులు(నవంబర్ 16-17) నైజీరియాలో గడపనున్నారు. ‘‘నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో మా సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియాకు ఇది నా మొదటి పర్యటన. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నా పర్యటన ఒక అవకాశంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం, భాగస్వామ్య విశ్వాసం గురించి నేను భారతీయ సమాజాన్ని, నైజీరియాలోని స్నేహితులను కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. నవంబర్ 18-19 తేదీల్లో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆతిథ్యం ఇవ్వనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని తదుపరి బ్రెజిల్‌లోని రియో డి జెనీరోకు వెళ్లిన అనంతరం ప్రధాని గయనాలో పర్యటించనున్నారు. 1968 తర్వాత ఒక భారత ప్రధాని ఈ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. అక్కడ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు గయానా పార్లమెంట్లో మోదీ ప్రసంగిస్తారు. తన పర్యటనలో మోడీ 2వ ఇండియా-కారికోమ్ సమ్మిట్‌లో కరేబియన్ దేశాల నాయకులతో చర్చించనున్నారు.
…………………………………………………….