
* తొలిసారి లోక్సభలో అడుగుపెడుతున్న ప్రియాంక
* అన్న రాహుల్ మెజార్టీని దాటేసి రికార్డ్ మెజార్టీ
* రికార్డ్ మెజార్టీపై సీఎం రేవంత్ హర్షం
ఆకేరున్యూస్, వయనాడ్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సవిూప అభ్యర్థిపై 3.94లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో అన్నా చెల్లెళ్లిద్దరూ లోక్సభ సభ్యులయ్యారు. తల్లి సోనియా ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రియాంక గాంధీ రికార్డు మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. ప్రియాంక గాంధీ ఘన విజయంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
…………………………………………………………………………….