
* కేంద్ర విధి విధానాలపై పార్లమెంట్ లో ఎంపీ కావ్య ప్రశ్న
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల పరిశ్రమపై అనుసరిస్తున్న విధానాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎంపీ కడియం కావ్య కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో బొగ్గు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశ ప్రజలకు స్పష్టతనివ్వాలని ఆమె కోరారు. ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి జవాబు చెప్తూ బొగ్గు ఉత్పత్తులపై కేంద్రం పారదర్శకంగా వ్యవహనిస్తోందని అన్నారు. శక్తి విధానంలో మార్పులు చేశామని ,న్యూ కోల్ డిస్ట్రిబ్యూషన్ పాలసీలో లో సవరింపులు చేశాని వివరించారు. కేంద్ర విధివిధానాల ప్రకారమే సింగరేణి సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తోందని వివరించారు.2025లో సవరించిన శక్తి విధానం ఆధారంగా పవర్ రంగానికి కొత్త బొగ్గు లింకేజీలు మంజూరు చేయడమవుతోందని ఆయన తెలిపారు. ఈ విధానాల వల్ల తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలకు స్థిరమైన బొగ్గు సరఫరా లభించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ విధానాల అమలుతో పారదర్శకత, సమాన అవకాశాలు, పరిశ్రమలకు మద్దతు, ఉపాధి అవకాశాల పెరుగుదల, అలాగే రాయల్టీ మరియు పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీ ఆదాయం లభిస్తోందన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
…………………………………………..