ఆకేరు న్యూస్, కమలాపూర్: వరంగల్ నగర పొలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ‘జాగృతి పోలీస్ కళా బృందం’ శుక్రవారం రాత్రి కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో పోలీస్ జాగృతి కళాబృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్దని,గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారమందించాలని, డయల్100, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, సీసీటీవీ కెమెరాలు, వృద్ధ తల్లితండ్రుల సంరక్షణ, మరియు సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ ఆప్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తు, 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ గురించి, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ,కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జి ఉమెన్ ASI శ్రీమతి నాగమణి, సభ్యులు, హెచ్ సి ఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు,రత్నయ్య, పీసీ పూల్ సింగ్, హెచ్ జీ ఎస్ శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
………………………………
