Pulla Karunakar has been promoted to IPS
* గ్రూప్-1 స్థాయి నుంచి ఐపీఎస్ శిఖరాలకు పుల్ల కరుణాకర్
* యువతకు నిత్య స్పూర్తి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల కరుణాకర్‌కు కేంద్ర హోంశాఖ అధికారికంగా ఐపీఎస్ (IPS) హోదా కల్పించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్, రాష్ట్ర పోలీసు విభాగం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఆయన సుదీర్ఘ సేవలు పనితీరు ఆధారంగా కేంద్రం IPS గా పదోన్నతి అందించింది. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఉప్పల్‌లో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి కష్టమే ప్రాతిపదికగా, నిబద్ధతే ఊపిరిగా ముందుకు సాగి, అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
2010లో పోలీస్ సర్వీసులోకి ప్రవేశించిన ఆయన, డీఎస్పీ హోదాలో కడప జిల్లా ప్రొద్దుటూరులో తొలి పోస్టింగ్ చేపట్టారు. అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూనే తాజాగా ఐపీఎస్ అధికారిగా పదోన్నతి పొందారు.
దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ క్యాడర్‌ను అధిరోహించడంతో ఉప్పల్ గ్రామంతో పాటు కమలాపూర్ మండలంలో మొదటి ఐపీఎస్ గా నిలవడంతో మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు, యువత ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
