Srisailam Family Tragedy
* శ్రీశైలంలో తీవ్ర విషాదం..
* వడ్డెర సత్రంలో ఘటన
అకేరు న్యూస్, శ్రీశైలం :శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని గదిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మృతులను సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు. వీరంతా సత్యసాయి జిల్లా బత్తలపల్లి ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
కుటుంబం శ్రీశైలానికి వచ్చి వడ్డెర సత్రంలో గది తీసుకుంది. మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు లోపలి నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతదేహాలు కనిపించాయి.
ప్రాథమికంగా ఇద్దరు పురుషులు గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండగా, ముగ్గురు మహిళలు బాత్రూమ్లో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ విషాద నిర్ణయానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఆత్మహత్యలకు పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
