* తెలంగాణ SIB కీలక ఆపరేషన్
ఆకేన్యూస్, హైదరాబాద్ : మావోలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా ఒకరి తరువాత మరొకరు లొంగిపోతున్నారు. బండి ప్రకాష్ తోపాటు.. పుల్లూరి ప్రసాదరావు, ఊరఫ్ వడ్కపూర్ చంద్రన్న డీజీపీ ఎదుట లొంగిపోయారు. అనారోగ్య సమస్యలతోనే తాను తుపాకీని వీడినట్లు చెప్పారు. వడ్కాపూర్ చంద్రన్న కేంద్ర కమిటీలో 17 సంవత్సరాలుగా వివిధ స్థాయిలో పనిచేశాడు. తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చేపట్టిన కీలక ఆపరేషన్ లో భాగంగా పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయాడు. ఐడియాలజీ రూపొందించడంలో కీలకంగా వ్యవహరించేవాడని ప్రసాదరావుకు పేరుంది. కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగిపోవడం మావోయిస్టుకు పెద్ద దెబ్బ. ముఖ్యమంత్రి ఇచ్చని పిలుపు మేరకు జన జీవన స్రవంతిలో కలుస్తున్నామని మీడియాకు చంద్రన్న చెప్పారు. మల్లోజుల కిషన్ జీకి ప్రధాన అనుచరునిగా కొనసాగారు.
……………………………………………….
