పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
* 40 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన పార్టీ
* ధురి నుంచి మళ్లీ సీఎం భగవంత్ మాన్ పోటీ
* మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు
* 2027 అసెంబ్లీ ఎన్నికలపై ముందస్తు కసరత్తు
ఆకేరు న్యూస్, డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముందస్తు కసరత్తు ప్రారంభించింది. 2027లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి ధురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. పార్టీ కీలక నేతలు, మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు తొలి జాబితాలో అవకాశం కల్పించారు.
కీలక నేతలకు టికెట్లు
తొలి జాబితాలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వాన్, పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కోటక్పురా నుంచి కల్తార్ సింగ్ సంధ్వాన్, లూధియానా వెస్ట్ నుంచి సంజీవ్ అరోరా, అమృత్సర్ సౌత్ నుంచి డాక్టర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్, అజ్నాలా నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్ పోటీ చేయనున్నారు. మొహాలీ నుంచి కుల్వంత్ సింగ్, హోషియార్పూర్ నుంచి బ్రమ్ శంకర్ శర్మ జింపాకు టికెట్లు కేటాయించారు.
40 మంది అభ్యర్థుల జాబితా
అమన్‌షేర్ సింగ్ (షెరీ కల్సీ)
కుల్దీప్ సింగ్ ధాలివాల్
డాక్టర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్
హర్మీత్ సింగ్ సంధూ
సర్వన్ సింగ్ ధున్
ఇందర్జీత్ కౌర్ మాన్
బల్కార్ సింగ్
కరంబీర్ సింగ్ ఘుమన్
జస్వీర్ సింగ్ రాజా గిల్
బ్రమ్ శంకర్ శర్మ జింపా
ఇషాంక్ కుమార్ చబ్బేవాల్
జై కిషన్ సింగ్ రౌరీ
సంతోష్ కటారియా
దినేశ్ చద్దా
కుల్వంత్ సింగ్
లఖ్బీర్ సింగ్ రాయ్
గురీందర్ సింగ్ గ్యారీ వారింగ్
జగ్తార్ సింగ్ దియాల్‌పురా
దల్జీత్ సింగ్ గ్రేవాల్ (భోలా)
కుల్వంత్ సింగ్ సిద్ధూ
అశోక్ ప్రసార్ (పప్పీ)
సంజీవ్ అరోరా
చౌధరీ మదన్‌లాల్ బగ్గ
మన్వీందర్ సింగ్ గియాస్పురా
మన్జీత్ సింగ్ బిలాస్పూర్
అమృత్‌పాల్ సింగ్ సుఖానంద్
డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా
దేవిందర్ జీత్ సింగ్ లద్దీ ధోస్
జగదీప్ కాంబోజ్ గోల్డీ
నరిందర్పాల్ సింగ్ సావ్నా
జగదీప్ సింగ్ కాకా బ్రార్
కల్తార్ సింగ్ సంధ్వాన్
అమోలక్ సింగ్
బల్జీందర్ కౌర్
గురుప్రీత్ సింగ్ బనావాలీ
లాభ్ సింగ్ ఉగోకే
కుల్వంత్ సింగ్ పండోరి
జస్వంత్ సింగ్ గజ్జన్మాజ్రా
భగవంత్ మాన్
అజిత్‌పాల్ సింగ్ కోహ్లీ
PAC భేటీ తర్వాత ప్రకటన
ఢిల్లీలోని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం జరిగింది. ఈ భేటీలో కేజ్రీవాల్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మనీష్ సిసోడియా, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తదితర నేతలు పాల్గొన్నారు. సమావేశంలో అభ్యర్థుల పేర్లపై చర్చించి తొలి జాబితాను ఖరారు చేసినట్లు పార్టీ ప్రకటించింది.
117 స్థానాలపై గురి
పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2027 మార్చి 16తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తొలి విడతలోనే 40 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను తదుపరి జాబితాల్లో వెల్లడించే అవకాశం ఉంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా నియోజకవర్గాల్లో ప్రచారం, పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలన్నది ఆప్ వ్యూహంగా కనిపిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

