* స్పందించిన సర్కారు
* సమస్యను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన తుమ్మల
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్(ENUMAMULA AGRUCULTURE MARKET) లో పునః ప్రారంభం కావడంతో భారీగా పత్తితో రైతులు తరలివచ్చారు. రెండు రోజుల అనంతరం కొనుగోళ్లు మొదలుకానున్నాయని ఆశించారు. అయితే మార్కెట్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్ నిర్వాహకులు L1, L2, L3 పేరుతో మిల్లులను, కఠిన నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో నేటి నుంచి CCI, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపి వేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. ఈ పరిస్థితిపై సర్కారు వెంటనే స్పందించింది. సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(TUMMALA NAGESWARARAO) రంగంలోకి దిగారు. అధికారులతో మాట్లాడారు. సమస్యను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయాలన్నారు. ఈమేరకు అధికారులు వ్యాపారులతో చర్చిస్తున్నారు.
……………………………..