* దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు
* మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ఈ సీజన్ లో వరిధాన్యం దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామమని మానకొండూర్ ఎంఎల్ ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్ఫష్టం చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి, జంగపల్లి, హన్మాజీపల్లె, గోపాల్ పూర్, మాదాపూర్, గన్నేరువరం గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల పనితీరును సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్లాలని, తద్వారా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో గన్నేరువరం మండల వ్యవసాయ అధికారి జె.కిరణ్మయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,కేడీసీసీ డైరెక్టర్ అలువాల కోటి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, లింగాల మల్లారెడ్డి, చిట్టి ఆనంద్ రెడ్డి, మాతంగి అనిల్,రజాక్ తదితరులు పాల్గొన్నారు.
