* నిర్ణీత సమయంలో మేడారం పనులు పూర్తి చేయాలి.
* అధికారులకు ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశం
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల ఆవరణలో అభివృద్ధి పనులలో వేగం పెంచి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
గురువారం తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి .ఈ ఎన్ సి మోహన్ నాయక్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మేడారం దేవాలయం అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం గేట్ పిల్లర్ల ఏర్పాటు చేయాలని, నాణ్యత లోపించకుండా స్టీల్, సిమెంట్ తో పుట్టింగ్ చేయాలని ఆదేశించారు. అధికారులకు పలు సూచనలను చేశారు. ప్రతి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, ఆర్ ఆండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, ఎండోమెంట్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
