* మై భారత్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా పలు కార్యక్రమాలు
ఆకేరు న్యూస్, హన్మకొండ: స్వచ్ఛతహీ సేవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మై భారత్ (నెహ్రూ యువ కేంద్ర) ఆధ్వర్యంలో చారిత్రాత్మక పుణ్యక్షేత్రం వేయి స్తంబాల దేవాలయంలో స్వచ్ఛతహీసేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మై భారత్ జిల్లా అధికారి అన్వేష్ చింతల నాయకత్వంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని, కేంద్ర పురావస్తు శాఖ ఉమ్మడి జిల్లా అధికారి మల్లేషం ముఖ్య అతిథులుగా పాల్గొని స్వచ్ఛతహీసేవ ర్యాలీ, వేయి స్తంబాల దేవాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడంతో పాటుగా, పరిశుభ్రత గురించి భక్తులకు అవగాహన కల్పించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ , కార్యక్రమ కోఆర్డినేటర్ ఎం.రాము ఆధ్వర్యంలో సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణంలోని వివిధ చోట్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వచ్ఛతహీసేవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మై భారత్ యొక్క నూతన పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా అధికారి అన్వేష్ చింతల, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని, కేంద్ర పురావస్తు శాఖ ఉమ్మడి జిల్లా మల్లేషం , అసిస్టెంట్ ప్రొఫెసర్ , కార్యక్రమ కోఆర్డినేటర్ ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.
…………………………..