
* సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆఫర్లు
* హెచ్ ఏసీఏ వివాదాన్ని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం
ఆకేరు న్యూస్, స్పోర్స్ట్ డెస్క్ : సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) బంపర్ ఆఫర్ ప్రకటించింది. పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని ఏసీయే పేర్కొంది. హెచ్ సీఏతో సన్ రైజర్స్ (SUN RISERS) వివాదం నేపథ్యంలో ఏసీఏ ఆ జట్టును తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్ లను విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించింది. సన్ రైజర్స్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఐపీఎల్ టికెట్లు, పాసుల విషయంలో ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఏ మధ్య వివాదం చెలరేగింది. టికెట్ల కోసం హెచ్ సీఏ (HCA) తమను ఒత్తిడి చేసిందని, ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొంది. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్ ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఇరువర్గాల మధ్య పలు కీలకమైన అంశాలు తెరపైకి వచ్చాయి. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం కెపాసిటీలో 10శాతం కాంప్లిమెంటరీ పాసుల కేటాయింపునకు ఎస్ఆర్ హెచ్ అంగీకరించింది.
…………………………………………