* బీజేపీ తరపున రేపు నామినేషన్ దాఖలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ పదవి వరించింది. భారతీయ జనతా పార్టీ ఆర్.కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మళ్లీ రాజ్యసభ పదవి వరించడంతో కృష్ణయ్యకు బీసీ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేండ్లపాటు ఉండగానే తన పదవికి ఈ ఏడాది సెప్టెంబర్లో రాజీనామా చేశారు.
………………………………..