* 400 మంది ప్రతినిధులతో ఇంటరాక్షన్
* కులగణనపై చర్చించే ఛాన్స్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం హైదరాబాద్ రానున్నారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో మేధావులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. దాదాపు 400 మంది వివిధ వర్గాల వారితో ఇంటరాక్ట్ అవుతారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణలో కులగణన ఈ నెల 6 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు రాహుల్ వస్తున్నారు. కులగణన వాస్తవ పరిస్థితులపై మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నేతలతో భేటీ అవుతారు. ట్రాన్స్ జెండర్లు, మహిళలతోనూ ముచ్చటిస్తారు. కులగణన ఎలా చేయాలనే అంశాలపై వారితో చర్చిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు బోయిన్ పల్లి బయల్దేరుతారు. 5.20 గంటలకు అక్కడికి చేరుకొని 5.30 గంటల నుంచి 6.30 వరకు ష్ట్రంలో అమలు చేయనున్న కుల గణనపై వివిధ వర్గాల, వివిధ రంగాల వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 7.10 లకు బేగంపేటకు చేరుకొని ఢల్లీి బయల్దేరి వెళ్తారు.
…………………………………………………………