![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-31.jpg)
* హడావుడిగా ఏర్పాట్లు
* అంతలోనే రద్దు ప్రకటన చేసిన కాంగ్రెస్ నేతలు
ఆకేరు న్యూస్, వరంగల్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. మంగళవారం
ఉదయం రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. రాహుల్ గాంధీతో పాటు సీఎం
రేవంత్ రెడ్డి కూడా వస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇందుకనుగుణంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు
కూడా చేపట్టారు. వరంగల్ నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ హనుమకొండలోని ఒక హెూటల్లో బస
చేయనున్నట్లు హడావుడి మొదలయింది. సాయంత్రం 5 గంటలకు చేరుకుంటే రాత్రి ఏడు గంటల వరకు
కూడా హెూటల్లో బస చేస్తారని ప్రచారం జరిగింది. అనంతరం చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్ళో విద్యార్థులతో
మాట్లాడుతూ ప్రయాణిస్తారని అనధికారికంగా ప్రచారం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ గాంధీ
పర్యటన రద్దయినట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పారు.
—————