
* తెలంగాణలో కొన్ని ఇతర జిల్లాలకు కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 7న వరంగల్(Warangal), హన్మకొండ జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం(Khammam), నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయడంతో పాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే, ఈ నెల 8న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు(Rains) పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
…………………………………….