* వాతావరణశాఖ అలర్ట్.. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
* మరో మూడు రోజులపాటు తెలంగాణలో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్షం పడే చాన్స్ ఉందని పేర్కొంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే నగరమంతా మబ్బులు కమ్మి ఉన్నాయి. హైదరాబాద్ తోపాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షాఉక కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అంరదూ అప్రమత్తమంగా ఉండాలని సూచించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
………………………………………………………
