ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అతి వృష్టి అనావృష్టి అన్నట్లుగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అతివృష్టి నెలకొంది గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయి, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరాన్ని వాన కమ్మేసింది..మరో మూడు గంటలు ఇదే పరిస్థితి ఉంటందని వాతావరణ శాఖ తెలిపింది.మేడ్చల్, మల్కాజిగిరి రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చీబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడలో జోరువాన కురుస్తోంది. SR నగర్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, మూసాపేట్లో కూడా జడివాన పడుతోంది. కూకట్పల్లి, కేబీహెచ్‌బీ, మియాపూర్‌లోనూ ఇదే పరిస్థితి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే నగరవాసులు భయపడుతున్నారు. వరదల్లో ముగ్గురు గల్లంతయిన విషయం తెల్సిందే.. జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆఫీసులు, ఇతర కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో ప్రజలు గమ్మస్థానాలకు చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
……………………………………….
