* కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
*జాతీయ రహదారుల నిర్మాణంపై వీడియో కాన్ఫరెన్స్
ఆకేరున్యూస్ హైదరాబాద్ : జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూ సేకరణ వెంటనే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డుఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై సీఎం కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్లకు పలు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను పూర్తి చేసి నష్టపరిహారం అందించాలని కోరారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల వివరాలను ఉన్నతాధికారులకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు ముఖ్యమంత్రి. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
