
* పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు
* వాతావరణ కేంద్రం హెచ్చరిక
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని.. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతుందని పేర్కొంది. మంగళవారం ఉదయం వరకు మధ్యబంగాళాఖాతం వరకు చేరుతుందని చెప్పింది. ఆ తర్వాత రెండురోజుల్లో మరింత ముందుకు కదులుతూ పశ్చిమ వాయువ దశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుపడుతాయని చెప్పింది. మంగళవారం నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.
………………………………………..