* కరీంనగర్, హైదరాబాద్‌లో సాయంత్రం వాన కురిసే చాన్స్
* వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ఎల్లో అలర్ట్(YELLO ALLERT) కూడా జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కరీంనగర్(KARIMNAGAR), హైదరాబాద్(HYDERABAD), నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్(ADIALABAD), ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట(SIDDIPETA), హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో దీపావళి రోజు సాయంత్రం అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి(KAMAREDDY) జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, నవంబర్ 4 వరకు రాష్ట్రంలో వానలు కొనసాగేందుకు అవకాశాలున్నాయని వివరించింది.
………………………………………