ఆకేరున్యూస్, సినిమా డెస్క్ : మాస్ మహారాజా రవితేజ(raviteja) అభిమానులకు పండుగ చేసుకునేలా దీపావళి రోజున గుడ్ న్యూస్ చెప్పింది సితార ఎంటర్టైన్మెంట్స్. అభిమానులకు పూనకాలు తెప్పించే టైటిల్‌తో కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. మాస్జాతర(mass jatara) పేరుతో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్(mr Bachan) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సినిమా చాలా పకడ్బందీగా నిర్మిస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా విడుదల తేదీని సైతం చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇడియట్(idiot) సినిమాలో రవితేజ చెప్పే ‘మనదే ఇదంతా’ అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా జోడించారు. ఓ జాతర సందడి నడుమ తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్నారు రవితేజ. ఈ సినిమా మాస్ యాక్షన్ ్టఎంటర్ టైనర్‌గా రూపొందిస్తున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఇది రవితేజ 75వ సినిమా కావడం.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
