Sannur Free Medical Camp
* ఆరోగ్యం పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి సర్పంచ్ చినపాక రజిత రాంబాబు
* బాలవికాస్, లుమినీస్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండలంలోని సన్నూరు గ్రామములో బాలవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో, హనుమకొండలోని ప్రముఖ లుమినీస్ ఆస్పత్రి వారి సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ చినపాక రజిత రాంబాబు శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చినపాక రజిత రాంబాబు మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ పనుల ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆమె కోరారు. ఏదైనా వ్యాధి బారిన పడ్డాక బాధపడటం కంటే, ముందే అప్రమత్తంగా ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.” ఆర్థిక ఇబ్బందుల వల్ల పట్టణాలకు వెళ్లి పెద్ద పెద్ద ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఒక గొప్ప వరమని ఆమె కొనియాడారు.
* సేవా సంస్థల కృషి అభినందనీయం
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మందులను పంపిణీ చేసిన బాలవికాస్ సేవా సంస్థకు, లుమినీస్ ఆస్పత్రి వైద్య బృందానికి ఆమె గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శిబిరంలో లుమినీస్ ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యులు గ్రామీణులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలతో పాటు ఇతర సాధారణ వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్యారాణి బృందం డాక్టర్ తేజస్విని, డాక్టర్ సంకీర్ణ, కృష్ణవేణి, ప్రసన్న, రాజేష్, బిక్షపతి, ఉప సర్పంచ్ సిహెచ్ కరుణాకర్, పంచాయతీ సెక్రెటరీ సత్యనారాయణ, బాలవికాస్ మెయిన్ కోఆర్డినేటర్ ఎం రమ, ఎం సరిత, తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
