TNGOS Leaders Pay Tribute
ఆకేరు న్యూస్,రాయపర్తి: హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్, TNGOS యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం టీఎన్జీవోస్ సెక్రెటరీ కత్తి (బైరి) సోమయ్య, జాయింట్ సెక్రెటరీ కత్తి రవీందర్ సోదరుడి అకాల మరణం పట్ల యూనియన్ నాయకులు సంతాప వ్యక్తం చేశారు.
హనుమకొండ జిల్లా సెక్రెటరీ కత్తి(బైరి)సోమయ్య. టి ఎన్ జి ఓ ఎస్ జాయింట్ సెక్రెటరీ కత్తి రవీందర్ సోదరుడు కత్తి కుమారస్వామి ఇటీవల అకాల మరణం చెందిన విషయం విదితమే దశదిన కర్మ కార్యక్రమము కిష్టాపురం గ్రామం వారి నివాసంలో ఏర్పాటు చేయగా కత్తి కుమారస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ..( కత్తి) బైరి సోమయ్య, కత్తి రవీందర్ కుటుంబంలో జరిగిన ఈ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసప్తప్త కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, కేంద్ర సంఘ ఉపాధ్యక్షులు రాము నాయక్, రాజేష్ ఖన్నా, సుధాకర్, భరత్, ప్రణయ్, రాజీవ్ రమేష్ యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
